హ్యూమన్ రైట్స్ మరియు మోరల్ వాల్యూస్ సభలో ఆలోచించేవిధంగా మాట్లాడిన వైసీపీ పార్లమెంట్ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్..!!

ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో రాజమండ్రి వైసీపీ పార్లమెంట్ కో ఆర్డినేటర్ గా నియమితుడైన మార్గని భరత్ రాజమండ్రి లో జరిగిన హ్యూమన్ రైట్స్ మరియు మోరల్ వాల్యూస్ సభ లో పాల్గొని విలువైన సందేశం ఇచ్చారు.. ఇవాళ్టి జెనరేషన్ కి మోరల్ వాల్యూస్ నేర్పించాల్సిన బాధ్యత ఉంది అన్నారు.. మనలో ప్రేమ, ఆప్యాయత, మానవత్వం ఉంటే మానవహక్కులు పరిరక్షించబడుతాయని, ప్రపంచదేశాలతో పోలిస్తే నైతిక విలువలున్న దేశం మన భారత దేశం అని వ్యాఖ్యానించారు.. పూర్వికులు మనకు అమ్మాయి కుటుంబ వాతావరణం నెలకొల్పి నైతిక విలువలు నేర్పించారని, ఇప్పటి జెనరేషన్ కి అవి నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉన్నాయని అయన వెల్లడించారు.. గతంలో దీనికి సంబంధించిన పాటలు స్కూల్స్ లో ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తప్పకుండా ఇప్పటి పిల్లలకు ఆ క్లాసులు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేసారు.. దీని ద్వారా భారత దేశం మరింత అత్యున్నత స్థాయికి వెళ్తుందని చెప్పారు.. ఇంతటి గొప్ప సభకు అతిధిగా రావడం చాల ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు పిల్లలతో పాటు పెద్దలు కూడా పాల్గొని సమాజ అభివృద్ధి కి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.