జగన్ ని మెప్పించిన మార్గాని యువకిశోరం..పార్లమెంటరీ అభ్యర్థి గా ప్రకటన.. !!

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా బిసీ సంఘం నాయకుడు మార్గాని నాగేశ్వర రావు , ఆయన తనయుడు మార్గాని భరత్ రామ్ లు సోమవారం వైసిపి లో చేరిన సంగతి తెలిసిందే.. ప్రజల సమక్షంలో జననేత వైఎస్ జగన్ యువకిశోరం మార్గాని భరత్ రామ్ ను రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ ఛార్జ్ గా నియమించారు.. ఈమేరకు మార్గాని భరత్ పార్టీ ఆదేశాలు, విధి విధానాలకు కట్టుబడి పనిచేస్తామని, ప్రజలకు నిస్వార్థమైన సేవను చేస్తానని అయన వెల్లడించారు.

పిన్న వయసులోనే ఇంతటి గొప్ప బాధ్యతని చేప్పట్టిన మార్గాని భరత్ ఎవరు.. ?

ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష అయన రక్తంలోనే ఉంది.. తండ్రి మార్గాని నాగేశ్వర రావు ప్రజల్లో బీసీ సంఘాల నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది.. కేవలం బీసీ ల్లోనే కాకుండా ఇతర కులాల ప్రజల్లో కూడా ఆయనకు మంచి పేరుంది.. అనేక వ్యాపార సంస్థలు, రోటరీ వంటి సంస్థల్లో నాగేశ్వర రావు చురుగ్గా వ్యవహరించేవారు.. అయన తనయుడే మార్గాని భరత్..

మాట నిలబెట్టుకున్న జగన్..

రాజమండ్రి పార్లమెంట్ స్థానం బిసీ కులానికి చెందిన అభ్యర్థికే అని వైసిపి అధినేత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు లో ప్రకటించారు. దాంతో అక్కడ సరైన అభ్యర్థి కోసం జగన్ విస్తృతంగా వేట మొదలు పెట్టగా వారికి మార్గాని నాగేశ్వర రావు సమాధానంగా కనిపించారు.. దాంతో ప్రజల్లో వారికున్న పలుకుబడి,ఆదరణ, సేవా దృక్పథం గమనించి జగన్ మార్గాని నాగేశ్వర రావు తనయుడు మార్గాని భరత్ రామ్ ని రాజమహేంద్ర వరం పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసారు..

Leave A Reply

Your email address will not be published.