ఏపీకి న్యాయం చేకూరే వరకు కేంద్రపై నా పోరాటం ఆగదు – చంద్రబాబు..!!

రేపు అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “రేపు అఖిల పక్ష సమావేశం జరగబోతుంది.. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని చంద్రబాబు అన్నారు.. ఢిల్లీ పై ఒత్తిడి తేవాలి, ప్రజల హక్కులను కాపాడాలి” అని బాబు పేర్కొన్నారు.. కేసుల మాఫీ కోసం రాజీపడింది వైసిపి అని విమర్శించారు.. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారితో జగన్ కుమ్మక్కైయ్యారని, ఆరోపించారు.. ఫిబ్రవరి 1 న కేంద్రం పెట్టేదే ఆఖరి బడ్జెట్ అని , అప్రాప్రియేట్ బిల్లు ముందు రోజే ఢిల్లీ లో దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఏపీకి న్యాయం చేసే వరకు కేంద్రంపై టీడీపీ పోరాటం ఆగదని వెల్లడించారు..

Leave A Reply

Your email address will not be published.