2.o మూవీ రివ్యూ

నటీనటులు : రజినీకాంత్, అక్షయ్ కుమార్,అమీ జాక్సన్, సుధాన్షు పాండే, రియాజ్ ఖాన్, కళాభవన్ షాజాన్ తదితరులు..

సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం : శంకర్
కథ : శంకర్, బి.జయమోహన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
నిర్మాతలు: ఎ.సుభాస్కారం, రాజు మహాలింగం
సంగీతం: ఎ.ఆర్.రెహ్మాన్
ఎడిటర్ : ఆంథోనీ

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు శంకర్,సూపర్ స్టార్ హీరో రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం రోబో 2.ఓ..దాదాపు సంవత్సరం పాటు ప్రేక్షకులను ఊరించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతుంది.. ఎన్నో అంచనాలల్తో వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.. ఓ వైపు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండడం, 4D సౌండ్ సిస్టం , భారీ విజువల్ ఎఫెక్ట్స్ లాంటి ఎన్నో వీశేషాలను నింపుకున్న ఈ చిత్రం ఈరోజు వస్తుంది.. గతంలో వీరి కాంబినేషన్ లో శివాజీ, రోబో సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుందో ఈ సమీక్షలో చూద్దాం..

కథ :
నగరంలోని అందరి సెల్ ఫోన్స్ హఠాత్తుగా మాయమైపోతుంటాయి. అసలిలా ఎందుకు జరుగుతుందో అని ప్రజలు అయోమయంలో పడిపోతుంటారు.. ఈ విషయాన్ని పోలీసులు పరిశీలిస్తుండగానే నగరంలో హఠాత్తుగా ఓ సెల్ ఫోన్ సంస్థ వ్యాపారి హత్యకు గురవుతాడు.. ఈ విషయాన్నీ కనుక్కోవడానికి వశికర్ (రజినీకాంత్) అమీ జాక్సన్(రోబో) లు కలిసి చిట్టి ని రీ లంచ్ చేస్తారు.. ఇదిలా జరుగుతుండగానే మాయమైపోయింది ఈ సెల్ ఫోన్స్ అన్ని ఓ పక్షి ఆకారంలో తయారై నగరాన్ని ధ్వంసం చేస్తుదని.. అసలిలా చేస్తుంది ఎవరు. ఎందుకు చేయిస్తున్నారు అనేది చిట్టి ఏ విధం గా కనుక్కుంది అనేదే సినిమా కథ..

నటీనటులు :
ఈ సినిమా లో సైయింటిస్ట్ వశీకరన్ పాత్రలో , చిట్టి , 2.ఓ మూడు పాత్రల్లో రజినీ కాంత్ నటన ఆకట్టుకుంది.. మూడు పాత్రలతో ప్రేక్షకులకు తన నటన విశ్వరూపం చూపించాడు.. ఇక అక్షయ్ కుమార్ పాత్ర ఈ సినిమా లో హైలైట్.. అటు పక్షి రాజుగా, కామన్ మాన్ గా మంచి నటన కనపరిచాడు.. అక్షయ్ లోని నటనా కోణాన్ని శంకర్ అద్భుతంగా ఆవిష్కరించాడు.. అమీ జాక్సన్ తన పాత్రలో బాగా నటించింది.. సినిమా మొత్తం అక్షయ్ కుమార్, రజిని, అమీ జాక్సన్ ఈ మూడు పాత్రల్లోనే తిరుగుతూ ఉండడంతో వేరే ఇతర నటులకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది..

సాంకేతిక నిపుణులు :

ఈ సినిమా లో మెయిన్ హైలైట్ గ్రాఫిక్స్ అని చెప్పాలి.. ఈ కథను సామజిక కోణంలో చూపిస్తూనే దానికి సాంకేతిక ను జోడించిన తీరు అద్భుతమని చెప్పాలి.. శంకర్ సినిమా అంటేనే పెద్ద పెద్ద సెట్టింగ్స్, భారీ తనం ఉట్టిపడేలా ఉంటాయి అన్నసంగతి తెలిసిందే ఈ సినిమాలోనూ అలాంటి భారీతనాన్ని చూపించాడు దర్శకుడు శంకర్. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అబ్బురపరుస్తుంది.. తన మ్యూజిక్ తో రెహ్మాన్ మ్యాజిక్ చేయగా 4డి సౌండ్ టెక్నాలజీ వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్ తీసుకెళ్లారు.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. లేక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి..

ప్లస్ పాయింట్స్ :

అక్షయ్ కుమార్ నటన
చిట్టి నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రజినీ మార్క్ స్టైల్..
కామెడీ

ఓవరాల్ గా రోబో సినిమా కి సీక్వెల్ గా వచ్చిన 2.ఓ విజువల్ వండర్ అని చెప్పాలి.. సరికొత్త లోకాన్ని చూసేందుకు తప్పకుండా సినిమా చూసి చూడాల్సిందే.. కమర్షియల్ అంశాలు ఏవీ లేకపోయినా మంచి సామజిక అంశం అయితే సినిమా లో ఉన్నాయి..

టాగ్ లైన్ : రోబో ని మించలేదు..

రేటింగ్ : 2.75/5

Leave A Reply

Your email address will not be published.