అమర్ అక్బర్ ఆంటోనీ రివ్యూ

నటీనటులు :

రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు..

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
స్క్రీన్ ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల
కథ : శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (CVM)
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ అమర్ అక్బర్ ఆంటోనీ’..చాల రోజుల తర్వాత తెలుగు లో సినిమా చేస్తున్న ఇలియానా కథానాయిక.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.. ఇటు రవితేజ కి, అటు శ్రీనువైట్ల కెరీర్లకు ఎంతో ముఖ్యమైన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం..

కథావిషయానికొస్తే,

ఈ సినిమా కథ ఓ రివెంజ్ స్టోరీ.. హీరో చిన్నప్పుడే తన తల్లితండ్రులను చంపిన నలుగురు ప్రతినాయకులను చంపి ఎలా పగ తీర్చుకున్నాడనేదే సినిమా కథ.. ఈక్రమంలో చిన్నప్పుడే విడిపోయిన హీరో హీరోయిన్ లు ఎలా తిరిగి కలుసుకున్నారు.. తన ఫ్యామిలీ ని చంపిన విలన్స్ ను అమర్ ఏవిధంగా చంపాడనేదే సినిమా కథ.. శ్రీనువైట్ల తన జోనర్ ని వదిలి కొత్తగా వెళ్లాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా అలరించిందో చూద్దాం..

నటీనటుల ప్రతిభ..

అమర్ అక్బర్ ఆంటోనీ అనగానే సినిమా లో మూడు పాత్రలు ఉన్నాయని అర్థమైపోతుంది.. ఆ పాత్రల్లో రవితేజ చక్కగా ఒదిగిపోయాడనిపిస్తుడ్ని.. అమర్ పాత్రలో సీరియస్ గా, అక్బర్ పాత్రలో జోవియల్ గా, ఆంటోనీ పాత్రలో స్టైలిష్ గా కనిపించి రవితేజ తన నటనలో మరోకోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు.. ఇక తెలుగు లోకి చాల రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మునుపటిలా సన్నగా కనిపించకపోవడం ఆమెకే కాదు సినిమా కె పెద్ద మైనస్.. స్క్రీన్ లో ఆమె అలా కనిపించడం ప్రేక్షకులకు పెద్ద గా మింగుడు పడలేదు.. ఇంతమంది యంగ్ హీరోయిన్స్ ఉండగా ఆమెను ఎందుకు తీసుకున్నారో తెలియాలి. ఇక ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, గిరిధర్ లు ప్రేక్షకులను నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు.. కొన్ని చోట్ల సక్సెస్ అయ్యాడు కూడా… విలన్స్ గా తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్ లు అలరించారు.. శుభలేఖ సుధాకర్, షియాజీ షిండే పర్వాలేదనిపించారు.. సినిమాలో బాల్యనటులుగా నటించిన లు చాల బాగా నటించారు..

సాంకేతి నిపుణుల పనితనం…

ఈ సినిమా కి ముందునుంచి బలం సినిమా కథే అనుకున్నారు.. స్క్రీన్ ప్లే కూడా సినిమా లో మేజిక్ చూపిస్తుందన్నారు.. కానీ ఈ రెండు సినిమా కి పెద్ద గా ఉపయోగ పడకపోగా ఇవే సినిమా కి మైనస్ అయిపోయాయి.. దర్శకుడు శ్రీనువైట్ల మరో సారి తన ఓల్డ్ రివెంజ్ స్టోరీ ని నమ్ముకుని బోల్తా పడ్డాడు.. కొన్ని సీన్స్ చీట్ చేసినల్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. డైరెక్షన్ కూడా మునుపటిలా లేదు.. శ్రీనువైట్ల లో సత్త తగ్గిపోయినట్లు ఈ సినిమా తో స్పష్టమవుతుంది..థమన్ మ్యూజిక్ ఆకట్టుకోలేదు..బ్యాక్ గ్రౌంగ్ బాగుంది..సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది..మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాల బాగున్నాయి..

ప్లస్ పాయింట్స్ :

రవితేజ..

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..

కామెడీ..

మైనస్ పాయింట్స్ :

కథ..స్క్రీన్ ప్లే..

స్లో నేరేషన్..

ఇలియానా

ఓవరాల్ గా ఎన్నో అంచనాలతో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు.. ముఖ్యంగా సి సెంటర్ ప్రేక్షకులను ఈ సినిమా అస్సలు నచ్చదు.. కథ పై పెద్ద గా పట్టు లేదు.. ఇంట్రెస్టింగ్ స్టోరీ కాదు.. అదే పాత చింతకాయ పచ్చడి.. ఇలాంటి స్టోరీ లను జనాలు చూడడం మానేశారని శ్రీనువైట్ల కి ఇంకా అర్థంకా అయినట్లు లేదు.. దూకుడు నుంచి ఇప్పటివరకు ఒకే స్టోరీ ను రకరకాలుగా జనులమీద రుద్దుతున్నాడు..

టాగ్ లైన్ : వాటా కాదు శ్రీనువైట్లకు టాటా చెప్పాలి..

రేటింగ్ : 2/5

Leave A Reply

Your email address will not be published.