వరుణ్ తేజ్.. ఈ టైం లో ప్రయోగాలు అవసరమా..!!

కెరీర్ మొదట్లో గాడి తప్పినా వరుణ్ తేజ్ గతం మూడు చిత్రాల హిట్ తో ఎంతో పరిణితి తో సినిమా లు చేస్తూ విజయాల్ని చవిస్తున్నాడు. మిస్టర్ సినిమా ఫ్లాప్ తర్వాత ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, F2 లాంటి వైవిధ్యభరితమైన, నటనకు ఆస్కారం ఉండే, కథాబలం ఉన్న సినిమా లు చేస్తూ రోజు రోజు కు ప్రేక్షకులకు డాగరవుతున్నాడు వరుణ్ తేజ్.. ఇదే ఊపు కొనసాగిస్తే తొందరలోనే స్టార్ హీరో అయ్యే అవకాశాలు పుష్కలం వరుణ్ తేజ్ కి.. అయితే ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వరుణ్ తేజ్ తాజగా వాల్మీకి సినిమా తో మరో ప్రయోగాత్మక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు..

హరీష్ శంకర్ ఓ తమిళ సినిమా ని వరుణ్ తేజ్ తో రీమేక్ చేస్తున్నాడు.. జిగర్తాండ మూవీ తమిళంలో సూపర్ హిట్ ఐన సినిమా.. అందులో నటించిన సిద్ధార్థ్, బాబీ సింహ లకు మంచి పేరొచ్చింది.. ఈ ఇద్దరి లో వరుణ్ తేజ్ బాబీ సింహ పాత్ర చేస్తున్నారు.. అయితే వరుణ్ తేజ్ కోసం హరీష్ ఆ పాత్ర తీరుతెన్నులు మార్చివేస్తున్నాడట.. ఏదేమైనా బాబీ సింహ పాత్ర సినిమా లో విలన్ అంటే వరుణ్ తేజ్ కూడా ప్రతినాయకుని పాత్ర చేస్తున్నాడన్నమాట.. సినిమా మొత్తం భయంకరమైన విలన్ గ ఉంది చివర్లో జోకర్ లా మారే పాత్ర విలన్ ది.. దీంతో ఇలాంటి పాత్ర చేయడం వరుణ్ తేజ్ కి అవసరమా అని పెదవి విరుస్తున్నారు మెగా అభిమానులు..పవన్ కి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ ఈ అబ్బాయికి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి..

Leave A Reply

Your email address will not be published.