పేట – చిత్ర సమీక్ష..

 

నటీనటులు : రజినీకాంత్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సిమ్రాన్, త్రిష, బాబీ సింహ, ఎం.శశికుమార్ తదితరులు
దర్శకత్వం : కార్తిక్ సుబ్బరాజ్
సంగీతం : అనిరుద్ రవిచంద్రన్
నిర్మాతలు : అశోక్ వల్లభనేని, కళానిధి మారన్
ఎడిటింగ్ : వివేక్ హర్షన్
ఛాయాగ్రహణం : తిరు
విడుదల తేది : 10 జనవరి 2018

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పేట’.. రోబో తర్వాత సూపర్ స్టార్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా కి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఐడిపోయాయి.. కాగా ఈ సంక్రాంతి కానుకగా నేడు ఈ చిత్రం విడుదల అయ్యింది.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ విషయానికొస్తే :

సెంట్రల్ మినిస్టర్ రికమెండేషన్ మీద నగరంలోని ఓ కాలేజీకి వార్డెన్ గా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు కాళీ (రజినీకాంత్).. వచ్చి రాగానే అక్కడున్న ర్యాగింగ్ కల్చర్ ని అంతమొందిస్తాడు..ఆ క్రమంలో రాగింగ్ టీం కి హెడ్ అయినా మైక్ (బాబీ సింహ) తో వైరం మొదలవుతుంది..అలా ఓసారి కాళీ ప్రియమైన స్టూడెంట్ పైన మైక్ ఎటాక్ చేయిస్తాడు.. ఆ ఎటాక్ గ్యాంగ్ లో తన మనుషులే కాకుండా వేరే మనుషులు కూడా ఉంటారు.. ఆ వేరే మనుషులు ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన జిత్తు (విజయ్ సేతుపతి) మనుషులు.. కాళీ కి , జిత్తు కి ఉన్న వైరం ఏంటి.. వీరిమధ్య ఉన్న బంధం ఏంటి అన్న సస్పెన్సు తో సినిమా పూర్తవుతుంది..

నటీనటులు :

సినిమా మొత్తం రజిని మేజిక్ అని చెప్పొచ్చు. తన మ్యానరిజం తో, స్టైల్ తో పూర్వపు రజినీకాంత్ ని గుర్తుకుతెచ్చాడు.. భాషా లాంటి కథ ఇన్నాళ్లకు రజినీకి దొరికిందని చెప్పొచ్చు.. సినిమా మొదటినుంచి చివరి వరకు రజినీ తప్ప ఏ క్యారెక్టర్ హైలైట్ గా కనిపించదు.. డైలాగ్స్, డాన్స్ , స్టైల్ అన్నిటితో రజినీకాంత్ చాల బాగా నటించారని చెప్పొచ్చు.. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికి మరోస్థాయిలో నటించారని చెప్పొచ్చు.. విజయ్ సేతుపతి రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో చాల బాగా అలరించాడు.. కాలేజీ స్టూడెంట్ గా బాబీ సింహ చాల బాగా చేశాడు.. త్రిష గెస్ట్ పాత్ర అని చెప్పొచ్చు.. రెండు మూడు సీన్స్ కి మించి ఉండదు.. సిమ్రాన్ చాల అందంగాకనిపించింది.. అలనాటి అందాన్ని ఏమాత్రం చెక్కుచెదరనీయకుండా చూపించింది..
ఫ్లాష్ బ్యాక్ లో శశికుమార్ అద్భుతంగా నటించారు. రజినీకాంత్ తమ్ముడిగా మంచి నటన కనపరిచాడు.. లవర్స్ గా సనంత్, మేఘ ఆకాష్ చాల క్యూట్ గా కనిపించారు..

సాంకేతిక విభాగం :

ఈ సినిమా కు మెయిన్ హైలైట్ ఈ సినిమా కథే.. దర్శకుడు కథ రాసుకున్న విభాగం చాల బాగుంది..స్క్రీన్ ప్లే లో కూడా ఎక్కడా మిస్టేక్ లేదు.. రజినీ ప్రజెంట్ చేసిన స్టైల్ అదిరిపోయింది.. రజినీ ఒకప్పుడు చూపించడంలో దర్శకులు ఎంత సక్సెస్ అయ్యారో ఇప్పటి తరం దర్శకులు అలా చూపించలేకపోతున్నారనే లోటు కార్తిక్ సుబ్బరాజ్ తీర్చేశాడు.. భాష రోజుల్లోకి తీసుకెళ్లాడు.. రజినీ కి తగ్గ డైలాగ్స్, సీన్స్ రాసి ప్రేక్షకులతో విజిల్స్ వేయించాడు.. సెకండ్ హాఫ్ ని కొంత ఇంట్రెస్ట్ గా తీసుకెళితే బాగుందనిపించింది.. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది.. ఎవరు కూడా ఆ ట్విస్ట్ ని ఊహించి ఉండరు.. సినిమాటోగ్రఫీ అందించిన తిరు ఓ రేంజ్ లో వర్క్ చేశారు.. కొన్ని కొన్ని సీన్స్ తనకు మాత్రమే సాధ్య అనిపించేలా డిజైన్ చేశాడు.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇప్పటికే సాంగ్స్ తో అదరగొట్టగా, నేపథ్య సంగీతం తో మరోసారి తానేంటో రుజువు చేశాడు.. కళానిధి మారన్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పనవసరంలేదు.. చాల బాగా రిచ్ గా అనిపించాయి..

ప్లస్ పాయింట్స్ :

రజినీకాంత్

ఇతర తారాగణం

సంగీతం

కథ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్..

తమిళ వాసనలు..

లవ్ ట్రాక్

చివరగా : మొత్తంగా రజినీ ఫాన్స్ కి ఈ సినిమా పండగ లాంటిదే.. రజినీ ని ఇష్టపడే వాళ్ళు , అభిమానులకు ఈ సినిమా తప్పకుండ నచ్చుతుంది..సినిమా చూసాక భాషా సినిమా గుర్తుకురాక మానదు.. ఇది అసలు సిసలు రజినీ సినిమా..

రేటింగ్ : 3 /5

Leave A Reply

Your email address will not be published.