మూడో వన్డే లోనూ టీం ఇండియా జయభేరి.. అదరగొట్టిన షమీ..!!

మూడో వన్డే లో 7 వికెట్లతో ఘన విజయం సాధించి టీం ఇండియా ఐదు వన్ డే ల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది.. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ లలో స్థిరంగా ఉన్న టీం ఇండియా వరుసగా సిరీస్ లు నెగ్గతూ ప్రపంచకప్ కు గట్టిగానే సమయాత్తమవుతుంది.. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ (28) స్వల్ప స్కోరుతో వెనుదిరగగా ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ (62), విరాట్ కోహ్లీ(60) అర్థశతకాలు నమోదు చేసుకున్నారు..కార్తిక్ (38 నాటౌట్), అంబటి రాయుడు(40 నాటౌట్) ల ఫినిషింగ్ టచ్ తో 43 ఓవర్ల లోనే ఇండియా విజయం సాధించింది.. భీకరమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న భారత బ్యాట్స్ మన్ లను ఏ విధంగా ను న్యూజిలాండ్ బౌలర్స్ అడ్డుకోలేకపోయారు.. అద్భుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ ని కోలుకోనివ్వకుండా చేసిన మహమ్మద్ షమీ (3/41) కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది..

Leave A Reply

Your email address will not be published.