న్యూజిలాండ్ పై చారిత్రాత్మక విజయం.. మెరిసిన కుల్దీప్, రోహిత్..!!

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్ డే సిరీస్ లో భాగంగా తొలి వన్ డే ని నెగ్గిన టీం ఇండియా రెండో వన్ డే 90 పరుగుల తేడాతో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించింది.. న్యూజిలాంగ్ గడ్డపై ఇన్ని పరుగుల ఆధిక్యంలో గెలవడం భారత్ కి ఇదే తొలిసారి.. యువ స్పిన్నర్ కుల్దీప్ మరోసారి తన మణికట్టు మాయాజాలంతో న్యూజిలాండ్ మట్టికరిపించాడు.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.. తొలి వికెట్ కి 154 పరుగుల భాగస్వామ్యం అందించిన రోహిత్(87), ధావన్(66) లు మరోసారి ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించారు.. విరాట్ 43 పరుగులు, రాయుడు 47 పరుగులు, ధోని 48 పరుగులు, జాదవ్ 22 పరుగులు చేయడంతో నిర్ణీత యాభై ఓవర్లలో టీం ఇండియా 324 పరుగులు చేసింది.. అనంతరం బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ ఏ తరుణంలో కుదురుకున్నట్లు కనపడలేదు.. టాప్ బ్యాట్స్ మన్ సైతం భారత బౌలింగ్ కి మోకరిల్లారు. కుల్దీప్ 4/45 తో మరోసారి మాయ చేయగా భువనేశ్వర్, చాహల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, షమీ, జాదవ్ తల వికెట్ తీసి టీం ఇండియా విజయంలో పాల్గొన్నారు.. అద్భుత ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది..

Leave A Reply

Your email address will not be published.