ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ..!!

జగన్ పాదయాత్ర సందర్భంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకాశం జిల్లాలో పర్యటించి కార్యకర్తల దగ్గరినుంచి అభిప్రాయాన్ని సేకరించి ఈసారి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ తరపున వైఎస్ షర్మిల ని పోటీ చేయించాలని అధినేత జగన్ కు సూచించారు.. వైవీ సుబ్బారెడ్డి కి రాజ్యసభ సీటును కేటాయించాలని ప్రతిపాదించింది.. ఒంగోలు లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పార్థసారథి రెండు గ్రూపులు ఏర్పడ్డాయని ప్రశాంత్ కిషోర్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.. అయితే వైవీ సుబ్బారెడ్డి కారణంగానే ఈ రెండు గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని పలువులు కార్యకర్తలు వెల్లడించారని, అందుకే సుబ్బారెడ్డి స్థానంలో షర్మిల పోటీ చేస్తే వైసీపీ కి ఉపయోగపడుతుందని వెల్లడించారట.. దీనివల్ల రెండు గ్రూపులు కలిసి పని చేస్తాయని మెజారిటీ తో ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవచ్చు అని జగన్ కి సూచించారట.. మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని జగన్ అమలుపరుస్తాడా చూడాలి..

Leave A Reply

Your email address will not be published.