మాజీ కేంద్రమంత్రి జార్జి ఫెర్నాండేజ్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్న పలువురు రాజకీయ ప్రముఖులు..!!

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ గత పది సంవత్సరాలుగా కోమా లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండేజ్ ఢిల్లీ లోని అయన నివాసం లో ఈరోజు ఉదయం 6 గంటలకు మృతి చెందారు.. ఈ విషయాన్నీ సమతా పార్టీ మాజీ అధ్యక్షులు వివి కృష్ణారావు తెలిపారు.. జనతాదళ్ పార్టీ లో కీలక నాయకుడైన ఫెర్నాండేజ్ 1994 లో ఆ పార్టీ ని వీడి సమతా పార్టీ ని స్థాపించారు.. 1967 నుంచి 2004 వరకు తొమ్మిది సార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు. కాగా అయన మృతి పట్ల రాజకీయ పార్టీ లకు అతీతంగా అన్ని పార్టీ ల రాజకీయ నేతలు అయన కు సంతాపాన్ని తెలుపుతున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ఆ మహానాయకుడి తమ సంతాపం తెలిపారు.. దేశ రాజకీయాల్లో ఉత్తమ నేతగా ఫెర్నాండేజ్ పేరు సంపాదించారని, పేద, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని ప్రధాని మోడీ అన్నారు..

Leave A Reply

Your email address will not be published.