కేంద్రంపై ఝులుమ్ విప్పనున్న చంద్రబాబు..ఒకరోజు ఢిల్లీ కి మకాం..!!

ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీల అమలుకోసం ఎపి సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఢిల్లీ లో దీక్ష చేపట్టనున్నారు.. అందుకోసం టీడీపీ సమావేశంలో చర్చిస్తున్నారు.. పార్లమెంట్ వేదికలో టీడీపీ ఎంపీ లు ఎపి గొంతు ను వినిపించిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ పార్లమెంట్ సమావేశాలను అస్త్రంగా మార్చుకోవాలని అయన భావిస్తున్నారు.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి ఎదురిస్తూ చివరి రోజు దీక్ష చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట.. ఇదే అంశంపై టీటీడీపీ లో చర్చించగా చంద్రబాబు దీక్షకు కూర్చుంటే జాతీయ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతారని ఎంపీ సృజన చౌదరి తమ అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తుంది.. రాష్ట్ర సమస్యలను బడ్జెట్ లో పరిష్కరించకపోతే దీక్షకు దిగాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. చంద్రబాబు దీక్ష ద్వారా మరో సారి ఎన్డీయే చేసిన అన్యాయం జాతీయస్థాయిలో ప్రధాన అంశం అవుతుందనని భావిస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.