వినయ విధేయ రామ మూవీ రివ్యూ..

నటీనటులు : రామ్ చరణ్ తేజ్, కియారా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ తదితరులు
దర్శకత్వం : బోయపాటి శ్రీను
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు : డివివి దానయ్య
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరా రావు, తమ్మి రాజు
ఛాయాగ్రహణం : రిషి పంజాబీ, ఆర్థర్ ఏ విల్సన్
విడుదల తేది : 11 జనవరి 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న చిత్రం వినయవిధేయరామ.. మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎంత యాక్షన్ తో కూడుకున్నాడో ఇప్పటికే విడుదలై అశేష స్పందన దక్కించుకున్న ట్రైలర్స్ లో చూసిన సంగతి తెలిసిందే.. గ్లామర్ డాల్ కైరా అద్వానీ హీరోయిన్ గా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా అలనాటి నటుడు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు ముఖ్యపాత్రలతో వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండగా ఈరోజే విడుదల అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఈమేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ విషయానికొస్తే :

నలుగురు అనాధ పిల్లలకు (ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవివవర్మ) ఒక చిన్న పిల్లాడు (రామ్ చరణ్) దొరుకుతాడు.. వారి ఐదుగురు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది.. అనాధలైనా ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి మెలసి ఉంటారు..రామ్ పెద్దన్న ప్రశాంత్ విశాఖ ఎలక్షన్ కమీషనర్ గా పనిచేస్తుంటాడు.. అయితే అక్కడ పందెం పరశురామ్ (ముఖేష్ ఋషి) చేసే అన్యాయాలను ఎదుర్కొంటాడు.. దాంతో తన ఫ్యామిలీని టార్గెట్ చేసిన పరశురామ్ వారిని ఇబ్బంది పెట్టడానికి బీహార్ లో ని మున్నాభాయ్ (వివేక్ ఒబెరాయ్) ని దింపుతాడు.. ఊహించని సమస్యలోకి మున్నాభాయ్ రామ్ ఫామిలీ ని దింపుతాడు.. దాంతో రామ్ ఎలా తన ఫామిలీ ని ఆ సమస్య నుంచి బయటపడేశాడు.. అంత పవర్ ఫుల్ విలన్ ని ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ..

నటీనటులు :

మెగా ఫ్యామిలీ హీరో అంటే మాస్ అభిమానులు ఎక్కువగా ఉంటారు.. ఇక మెగా పవర్ స్టార్ కి అయితే మాస్ ప్రేక్షకులు చాల ఎక్కువగా ఉంటారు.. అభిమానులు ఎలానైతే రామ్ చరణ్ ని చూడాలనుకున్నారో అలానే చూశారు ఈ సినిమాలో.. సినిమామొత్తం రామ్ చరణ్ చాల బాగా యాక్టివ్ గా కనిపించాడు.. కుటుంభం సన్నివేశాల్లో చాల బాగా ఆకట్టుకున్నాడు.. చెర్రీ డాన్సుల గురించి పెద్ద గా చెప్పనవసరం లేదు.. కైరా అద్వానీ కేవలం పాటలకే పరిమితమైపోయింది.. ప్రతినాయకుడిగా వివేక్ ఒబెరాయ్ రక్తి కట్టించాడు.. ప్రశాంత్, స్నేహ తదితర ముఖ్య పాత్రలన్నీ పాత్రల పార్థి మేరకు చాల బాగా నటించారు..

సాంకేతిక విభాగం :

బోయపాటి తన ఫార్ములా ని ఏమాత్రం పక్కన పెట్టకుండా భారీ ఫైట్స్ తో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా తీసి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.. మొదటి అర్ధభాగం ఫ్యామిలీ సన్నివేశాలను బాగానే తెరకెక్కించిన సెకండ్ హాఫ్ లో మాత్రం యాక్షన్ పార్ట్ తప్ప మిగితా సన్నివేశాలు ఆకట్టుకునే లా ఉండదు అనిపిస్తుంది. అయితే చరణ్ ని మాస్ గా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయాడు.. దేవిశ్రీ ప్రసాద్ పర్వాలేదనిపించాడు.. ఆర్థర్ ఎ విల్సన్ , రిషి పంజాబీ ల వర్క్ చాల బాగుంది.. చిత్ర నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి..

ప్లస్ పాయింట్స్ :

రామ్ చరణ్ డాన్స్
యాక్షన్ సన్నివేశాలు..
ఫ్యామిలీ ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్
కథ కొత్తగా లేకపోవడం

చివరగా : మొత్తంగా రామ్ చరణ్, బోయపాటి ల కలయిక లో వచ్చిన వినయవిధేయ రామ్ వినయవిదేయతలతో ఉన్నా మితిమీరిన యాక్షన్ తో ప్రేక్షకులను బోర్ కొట్టిస్తుంది.. కథ పై ద్రుష్టి పెట్టకుండా కాంబినేషన్, యాక్షన్ మీదనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది.. రొటీన్ స్టొరీ తో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్.. బిసి సెంటర్స్ ని మాత్రమే సినిమా అలరిస్తుంది..

రేటింగ్ : 2.75/5

Leave A Reply

Your email address will not be published.