మిస్టర్ మజ్నుమూవీ రివ్యూ..

టైటిల్ : మిస్టర్ మజ్ను
నటీనటులు : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, ప్రియదర్శి, నాగబాబు, రావు రమేష్, హైపర్ ఆది తదితరులు..
ఛాయాగ్రహణం : జార్జ్ సి విలియమ్స్
సంగీతం : ఎస్.ఎస్.తమన్
దర్శకుడు : వెంకీ అట్లూరి
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 25 జనవరి 2019

తొలి సినిమా అఖిల్ తో తీవ్ర నిరాశ పరిచిన అఖిల్ రెండో సినిమా హలో తో పర్వాలేదనిపించారు.. అయితే తనమీదున్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయారు.. తాజగా తన మూడో సినిమా మిస్టర్ మజ్ను సినిమా తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తొలి సినిమా తొలిప్రేమ సినిమా తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ సినిమా కు దర్శకత్వం వహించగా ఈ సినిమా ప్రేక్షకులను ఈమేరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూద్దాం..

కథ విషయానికొస్తే,

లండన్ లో చదువుకుంటున్న విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్) ప్లే బాయ్ లా అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు.. ఓ సారి అది చూసిన నిక్కీ (నిధి అగర్వాల్) అఖిల్ ని తప్పుగా అర్థం చేసుకుంటుంది.. అయితే తన తో జరిగిన జర్నీ లో నిక్కీ అమ్మాయిలతో ఎలా ఉన్నా విక్కీ మంచితనం వ్యక్తిత్వం నచ్చి ప్రేమలో పడుతుంది.. కానీ విక్కీ నిక్కీ ప్రేమను రిజెక్ట్ చేస్తాడు.. నిక్కీ వెళ్ళిపోయిన తర్వాత విక్కీ కి ఆమె లేని లోటు కనిపించి తన ప్రేమ విలువ తెలుసుకుని తన కోసం మళ్ళీ బయలుదేరుతాడు.. అలా వెళ్లిన అఖిల్ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. వాటన్నిటిని దాటుకుని విక్కీ ఎలా తన ప్రేమను దక్కించుకున్నాడు అనేదే సినిమా కథ..

నటీనటుల ప్రతిభ :

సినిమా లో మొదటి నుంచి చివరి వరకు కనిపించేది అఖిల్, నిధి అగర్వాల్ అని చెప్పాలి.. అఖిల్ నటనలో చాల ఇంప్రూవ్ అయ్యాడు.. డాన్స్ లు చాల బాగా చేస్తున్నాడు.. ఎమోషన్స్ సీన్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.. ఇక లవర్ బాయ్ గా, ప్లే బాయ్ గా అఖిల్ చాల బాగా యాక్ట్ చేశాడు.. కొన్ని కొన్ని సందర్భాల్లో తన నటన తో నే ఆ సీన్ కి హైప్ తీసుకొచ్చ్డు.. నిధి అగర్వాల్ చాల బాగా నటించింది. రెండో సినిమాకే మంచి పరిణితి కనిపించింది.. గ్లామర్ కి ఎక్కువ స్కోప్ లేకపోయినా అభినయం తో ఆకట్టుకుంది..అక్కడక్కడా తేలిపోయినా కళ్ళతోనే నటించి కవర్ చేసింది.. ప్రియదర్శి, హైపర్ ఆది ల కామెడీ వర్క్ అవుట్ అయ్యింది.. ఫస్ట్ హాఫ్ లో ప్రియదర్శి నవ్విస్తే, సెకండ్ హాఫ్ లో అది పంచులతో అలరించాడు.. మిగితా నటీనటులకు నటించడానికి పెద్ద గా స్కోప్ లేకపోయినా పర్వాలేదనిపించారు..

సాంకేతిక నిపుణులు :

తొలిప్రేమ తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి రెండో సినిమా కు కూడా అదే జోనర్ ని ఎంచుకుని సేఫ్ జోన్ లో కి వెళ్ళాడు కానీ ఈసారి ఆ ప్రయత్నం దెబ్బతీసేటట్లు ఉందని చెప్పాలి.. ఫస్ట్ హాఫ్ అంత ఎంతో ఎంటర్ టైనింగ్ ఉన్న సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి చాల డల్ అయిపొయింది. దర్శకుడు సెకండ్ హాఫ్ మీద శ్రద్ధ చూపించలేదు.. కథ కూడా రొటీన్ కథ ను ఎంచుకుని కొత్తదనం లేకుండా కొత్త యాక్టర్స్ ని ఎంచుకుని సినిమా తీసి ఫెయిల్ అయ్యాడు.. అందరు ఊహించే సీన్స్ తో సెకండ్ హాఫ్ సాగుతుంది.. క్లైమాక్స్ అంత కన్విన్సింగ్ గా ఉండదు.. తమన్ మ్యూజిక్ ఈ సినిమా కు మంచి సంగీతం ఇవ్వలేదని చెప్పాలి.. పాటలు చాల డల్ గా ఉన్నాయి.. నేపథ్యం సంగీతం పర్వాలేదు.. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.. హీరోయిన్ ని , ప్రకృతి అందాలను చాల బాగా చూపించాడు.. ఎడిటింగ్ లు పర్వాలేదు.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

ప్లస్ పాయింట్స్ :

అఖిల్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్
రొటీన్ స్టోరీ

మొత్తానికి మూడో సినిమా కూడా అఖిల్ కి హిట్ ని ఇవ్వలేకపోయింది.. సరైన కథను ఎంపిక చేసుకోవడంలో అఖిల్ ఫెయిల్ అవుతుండడమే అందుకు కారణం.. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ వల్ల దానిమీద ఇంప్రెషన్ కూడా పోతుంది.. అఖిల్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నా అఖిల్ హిట్ ఖాతా తెరవడం కోసం మరో మంచి సినిమా చేయాల్సి ఉంది..

Rating :2.25/5

Leave A Reply

Your email address will not be published.