విజయ్ దేవరకొండ కష్టాల్లో పడబోతున్నాడా..!!

మొదటి సినిమా నుంచి విజయ్ దేవరకొండ హిట్స్ కొడుతూ యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమా ఆయన్ని స్టార్ హీరో గా మార్చాయి..కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ భరత్ కమ్మ దర్శకత్వంలో ‘ డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్నాడు.. అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.. కాగా విజయ్ దేవరకొండ ఎందుకు పెద్ద దర్శకుల తో పనిచేయట్లేదని ప్రశ్నకు ఎదురవగా విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ ప్రస్తుతం పెద్ద దర్శకులంతా తమ తమ సినిమా లతో బిజీ గా ఉన్నారని మంచి కథ తో వస్తే పెద్దా , చిన్నా అనే తేడా లేదు ఎవరితో అయినా పనిచేస్తా అని అన్నారు.. అయితే ఈ యాటిట్యూడ్ సినిమా లో అయితే పర్వాలేదు.. నిజజీవితం లో పనికిరాదని అంటున్నారు సినిమా విశ్లేషకులు.. చిన్న దర్శకులతో హిట్స్ దొరుకుతున్నాయి కాబట్టి పెద్ద దర్శకులతో పనిలేదు అన్న తరహాలో విజయ్ మాట్లాడుతున్నాడు.. రేపు ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు పెద్ద డైరెక్టర్ హెల్ప్ కావాల్సిందే.. అందుకే విజయ్ దేవరకొండ ఈ తరహా ప్రాబ్లెమ్ ని చూసుకుంటే మంచిదని అంటున్నారు..

Leave A Reply

Your email address will not be published.