శర్వానంద్, సమంత ల 96 రీమేక్..!!

2017 లో కలిసి వచ్చినట్లు శర్వానంద్ కి 2018 కలిసి రాలేదు.. శతమానం భవతి , మహానుభావుడు చిత్రాలతో 2017 లో హిట్స్ కొత్తగా, 2018 లో చేసిన ఒక్క సినిమా అటకెక్కేసింది.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడి పడి లేచే మనసు సినిమా ఎన్నో అంచనాలతో రాగ, ఆ సినిమా మొదటి రోజునుంచే ఫ్లాప్ టాక్ ని దక్కించుకుంది.. ప్రస్తుతం సుధీర్ వర్మ చిత్రంతో బిజీ గా ఉన్న శర్వానంద్ ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమా ని తెలుగులో దిల్ రాజు హక్కులను దక్కించుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా లో ఏ హీరో అయితే బాగుంటుందా అని చాల రోజులనుంచి ఆలోచిస్తుండగా చివరికి ఆ అవకాశం శర్వానంద్ కి వెళ్లిందని తెలుస్తుంది.. నిజానికి విజయ్ సేతుపతి చేసిన ఆ పాత్రకి శర్వానంద్ అయితే సరిగ్గా సరిపోతాడు.. ఇక త్రిష పాత్ర లో సమంత నటిస్తుంది.. ప్రస్తుతం మజిలీ , బేబీ చిత్రాలతో బిజీ గా ఉన్న సమంత ఈ సినిమా చేయడంతో ఆమె చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు చేస్తున్నట్లయింది.. మొత్తానికి కాంబినేషన్ సెట్ అయ్యింది.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుందని తెలుస్తుంది..

Leave A Reply

Your email address will not be published.