రాజమౌళి సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్స్..!!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ కథానాయకులు గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండవ షెడ్యూల్ లో షేరేవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా రాజమౌళి చేస్తున్న పీరియాడిక్ సినిమా గా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.. భారీ చిత్రాలు చేసే రాజమౌళి ఈ సినిమా తో మరో సంచలనం సృష్టించబోతున్నట్లు యూనిట్ చెప్తుంది.. అందుకే కథను కూడా పీరియాడిక్ కథని ఎంచుకుని దానికి కమర్షియల్ హంగులు జోడించనున్నారట.. అయితే ఈ సినిమా కి హీరోయిన్ లు అనే సందేహం అందరిలో నెలకొంది..

రాజమౌళి సినిమా లో ఛాన్స్ కొట్టేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరా అని అందరు ఎదురుచూస్తుండగా ప్రస్తుతం సమాధానం దొరికింది.. ఈ సినిమా లో టాలీవుడ్ హీరోయిన్స్ కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఈ సినిమా లో పరిణితి చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తుండగా, సినిమా లో మరో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట.. వారు కూడా బాలీవుడ్ యాక్టర్స్ అంటున్నారు.. సోనాక్షి సిన్హా, అలియా భట్ వీరిద్దరూ ఈ సినిమా లో నటించే అవకాశం దక్కించుకున్నారట.. ప్రస్తుతం రాజమౌళి ఇమేజ్ దేశమంతా ఉండడంతో అన్ని భాషల వారికి సినిమా కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలని రాజమౌళి ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారట.. మూడో షెడ్యూల్ నుంచి వీరు షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది..

Leave A Reply

Your email address will not be published.