ఎన్టీఆర్-కథానాయకుడు చిత్ర సమీక్ష..

నటీనటులు : బాలకృష్ణ, విద్యాబాలన్,సుమంత్, రానా దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్, ప్రకాష్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు..
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాతలు : నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
మాటలు : సాయి మాధవ్ బుర్రా
ఛాయాగ్రహణం : జ్ఞానశేఖర్ వీఎస్
విడుదల తేది : 09 జనవరి 2018

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా అయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ – కథానాయకుడు చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.. తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఇప్పటికే అంచనాలుండగా ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది..భారీ తారాగణంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ద్వితీయ భాగం ఫిబ్రవరి 7 న విడుదల అవుతుంది.. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూసి తెలుసుకుందాం..

కథ విషయానికొస్తే :

రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే రామారావు (బాలకృష్ణ) అక్కడ జరిగే అన్యాయాన్ని ఎదురించి రాజీనామా చేసి సినిమాల్లోకి వెళతాడు.. అలా బెజవాడ నుండి మద్రాస్ వెళ్లిన రామారావు హీరో అవడానికి ఎలా ఇబ్బంది పడ్డారు.. హీరో అయ్యాక ఆయన కి ఎదురైన ఒడిదుడుకులు ,చేరిన అద్భుతమైన శిఖరాలు ఎలా ఉన్నాయి అని చూపించే ప్రయత్నమే సినిమా కథ..

నటీనటులు :

ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఈ సినిమా కి అన్నీ తానే అయి నిలిచిన నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాలి.. సినిమాలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గా అద్భుతమైన ప్రదర్శన చేశారు.. నిజంగా ఎన్టీఆర్ ని చూస్తున్నట్లే ఉంది.. ఎన్టీఆర్ వచ్చి బాలకృష్ణ లో చేరి పరకాయ ప్రవేశం చేసినట్లుంది..ముఖ్యంగా కుమారుడు మరణించిన సన్నివేశంలో అద్భుతం గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు..సెకండ్ హాఫ్ లో మరింత పర్నీతిగా కనిపించదు బాలకృష్ణ.. తండ్రికి తగ్గ తనయుడిగా చాల బాగా మెప్పించాడు.. బసవతారకంగా విద్య బలం మెప్పించిందని.. తెలుగు నటి కాకపోయినా నిండు తెలుగుదనంతో , అచ్చమైన నటనతో అలరించింది.. అక్కినేని నాగేశ్వర రావు పాత్ర లో సుమంత్ ఒదిగిపోయాడు.. ఎన్టీఆర్ కి సపోర్ట్ గా నాగేశ్వర రావు నిలిచినా వైనం కళ్ళకు కట్టినట్లు చూపించారు.. కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో చాల బాగా కుదిరాడు.. చంద్రబాబు పాత్రలో కొద్దీ సేపే కనిపించినా విజిల్స్ వేయించాడు.. సెకండ్ పార్ట్ లో తన పూర్తి పార్ట్ ఉండబోతున్నల్టు చివరి లో సన్నివేశం చూస్తే తెలుస్తుంది.. మిగితావారు చిన్న చిన్న పాత్రలే వేసిన చాల బాగా ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా నందమూరి త్రివిక్రమ రావు పాత్రలో చేసిన దగ్గుబాటి రాజ చాల బాగ నటించారు..

సాంకేతిక విభాగం :
దర్శకుడు క్రిష్ ఈ సినిమా తో తన స్థాయి తో పాటు దర్శకత్వ ప్రతిభ కూడా మెరుగుపరుచుకున్నాడు.. సినిమా ను చాల బాలన్స్ గా తీసుకేల్లడంతో సక్సెస్ అయ్యాడు.. రచయిత సాయి మాధవ్ బుర్రా మంచి సంభాషణలు సమకూర్చారు.. ఎం.ఎం. కీరవాణి సంగీతం చెప్పనవసరం లేదు.. నేపథ్య సంగీతం అద్భతంగా చేశారు.. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో అందరు చాల బాగా పనిచేశారు.. ముఖ్యం గా మేకప్ డిపార్ట్ మెంట్ చాల బాగా పనిచేసింది.. అందరి పాత్రలు చాల చక్కగా డిజైన్ చేసి వరిజినల్ నటులే వచ్చినట్లు కనిపించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.. అలాంటి సెట్స్ కనిపించడంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ వర్క్ బాగుందని చెప్పుకోవాలి.. ఎన్.బి.కే ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాల రిచ్ గా ఉన్నాయి.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమా ని నిర్మించి బాలకృష్ణ ఇటు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు..

ప్లస్ పాయింట్స్ :

కథ
బాలకృష్ణ
మేకప్
సినిమాటోగ్రఫీ
సంగీతం

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో అక్కడక్క బోరింగ్ సన్నివేశాలు

చివరగా : మొత్తంగా ఈ తరానికి ఎన్టీఆర్ గురించి తెలియజేయడం లో బాలకృష్ణ సఫల మయ్యాడని చెప్పొచు.. ఇక మహానాయకుడు సినిమా పై అందరి ద్రుష్టి పడింది. సినిమా ఎక్కడ ఎవరిని నిరశాపరిచే టట్లు లేదు. ఎన్టీఆర్ గురించి తెలుసుకుకోవాలన్న కుతూహలం ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే..

రేటింగ్ : 3.5 /5

Leave A Reply

Your email address will not be published.