కంగనా ని వదిలేయండి క్రిష్.. మణికర్ణిక ని మీరే డైరెక్ట్ చేశారు..!!

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా సుపరిచితుడు అన్న సంగతి తెలిసిందే.. అక్కడ కొన్ని సినిమాలు చేసి అక్కడ కూడా మంచి ఫేమ్ దక్కించుకున్నాడు.. కాగా అయన కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రానికి దర్శకత్వం వహించి మధ్యలో వదిలేశాడు.. అభిప్రాయం భేదాల కారణంగా ఆ సినిమా ను వదులుకోగా ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాడు.. అయితే ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి పేరు సంపాదించుకుంది.. కంగనా కి మంచి పేరు రాగ, సినిమా కు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది.. అయితే సినిమా టీం కి, క్రిష్ కి మధ్య ఇంకా వివాదం కొనసాగుతున్నట్లే కనిపించింది.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో క్రిష్ మణికర్ణిక సినిమా సెకండ్ హాఫ్ మొత్తం తానే డైరెక్ట్ చేసినట్లు చెప్పారు. మొదటి భాగం లోని కొన్ని సీన్స్ ని మాత్రమే కంగనా డైరెక్ట్ చేసిందని సినిమా హిట్ విషయం లో క్రెడిట్ అంత తనదే అన్నట్లు మాట్లాడారు దానికి కంగనా రనౌత్ చెల్లెలు రంగోలి చందేల్ మాట్లాడుతూ ” కొంచెం ప్రశాంతంగా ఉండండి.. ఈ చిత్రం లో ప్రధాన పాత్ర కంగనాదే.. ఆమెను ఎంజాయ్ చేయనివ్వండి.. సినిమా సక్సెస్ ని ఆస్వాదించనీయండి.. సినిమా మీరే డైరెక్ట్ చేశారు ఇప్పుడెవరు కాదన్నారు” అని వెటకారం గా సమాధానం ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.