F2 మూవీ రివ్యూ..

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు : దిల్ రాజు
ఎడిటింగ్ : బిక్కన తమ్మిరాజు
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
విడుదల తేది : 12 జనవరి 2018

టాలీవుడ్ లో మల్టి స్టారర్ ట్రెండ్ ఆరంభమయ్యాక ఎక్కువ మల్టి స్టారర్ చిత్రాల్లో నటించిన హీరో వెంకటేష్ అనే చెప్పాలి.. మల్టీ స్టారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వెంకటేష్ చాల రోజుల తర్వాత మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సినిమా F2.. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో గా ఎదుగుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరో గా నటిస్తుండగా, మొదటి సినిమా నుంచి సక్సెస్ ని అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.. ఫ్యామిలీ సినిమాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా పై సహజంగా భారీ అంచనాలేర్పరుచుకోగా ఈ చిత్రం ప్రేక్షకులను ఈమేరకు అందుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం..

కథ విషయానికొస్తే :

ఎం.ఎల్.ఏ వద్ద పనిచేసి వెంకీ (వెంకటేష్) కి హారిక (తమన్నా) తో పెళ్లి జరుగుతుంది.. అప్పటివరకు ఎంతో ఎంజాయ్ గా జీవిస్తున్న వెంకీ కి హారిక తో పెళ్లి తో ఒక్కసారిగా మారిపోతుంది.. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఈగోలతో అనుక్షణం నరకం అనుభవిస్తుంటారు.. ఈలోపు వరుణ్ (వరుణ్ తేజ్) తమన్నా చెల్లెలు హానీ (మెహ్రీన్) తో ప్రేమలో పడతాడు.. వెంకీ వద్దని చెప్పినా వినకుండా హానిని పెళ్లి చేసుకుంటాడు.. అక్కాచెల్లెళ్ల అధిపత్యానికి బలైపోతున్న వెంకీ , వరుణ్ లు పక్కింటాయన(రాజేంద్ర ప్రసాద్) సలహాతో యూరప్ వెళతారు.. అది తెలిసిన హారిక, హానీ లు కూడా యూరప్ వెళతారు.. అక్కడికెళ్లిన ఈ నలుగురు అనుకోని సమస్య లో పడతారు.. ఇంతకీ ఆ సమస్య ఏంటి.. దానినుండి వీరు ఎలా బయటపడతారు అనేదే సినిమా..

నటీనటులు :

పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ కథలో కూడా పాత్రలు కూడా అంతే వినోదాత్మకంగా ఉంటాయి.. పైగా ఇలాంటి కథలు చేయడంలో వెంకటేష్ ఎంత సామర్ద్యుడో అందరికి తెలిసిందే.. తన స్టైల్ కి ఏమాత్రం తగ్గకుండా వెంకీ ఈ సినిమాలో ఎంతో ఫన్ వచ్చేవిధంగా నటించాడు.. పెళ్లి కి ముందు ఫన్ ని, పెళ్ళికి తర్వాత ఫ్రేస్టేషన్ ఫీలింగ్స్ ని చాల బాగా చూపించాడు.. అటు వరుణ్ కూడా తెలంగాణ కుర్రాడిలా బాగా నటించాడు..తాను కొత్త జోనర్ లో నటిస్తున్నాడన్న ఫీల్ లేకుండా వెంకీ తో పోటాపోటీగా నటించాడు.. తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించాడు.. తొలిసారి తనలోని కామెడీ యాంగిల్ ని చూపించాడు.. తమన్నా, మెహ్రీన్ తమ అందాలతో, అభినయాలతో అలరించారు.. రాజేంద్రప్రసాద్, రఘుబాబు, ప్రకాష్ రాజ్, నాజర్ , అన్నపూర్ణ, మిగితా నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు..

సాంకేతిక విభాగం :

వినోదాత్మకమైన కథలకు మాస్ అంశాల్ని జోడించి సినిమా లు తీయడంలో అనిల్ రావిపూడి పడిపోయాడు.. తొలి సినిమా పటాస్, రెండో సినిమా సుప్రీమ్, మూడో సినిమా రాజా ది గ్రేట్ లతో అనిల్ రావిపూడి స్టామినా తెలిసిపోయింది.. ఇప్పుడు వెరైటీ గా కామెడీ ప్రధానంగా F2 ని తెరకెక్కించాడు. కమర్షియల్ జోలికి పోకుండా అనిల్ రావిపూడి తీసిన పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది.. సున్నితమైన వినోదాన్ని చక్కగా ఆవిష్కరించాడు.. ప్రతి ప్రేక్షకుడి జీవితంలో జరిగియే సంఘటనలే కాబట్టి ఈజీ గా సినిమా కి కనెక్ట్ అవుతారు.. స్టోరీ కూడా అలానే ఉంటుంది.. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందుకు తగ్గట్లే ఉంటుంది.. పాటలు ఇప్పటికే హిట్ అవగా, సినిమా నేపథ్య సంగీతం కూడా కుదిరింది.. అన్ని విభాగాల్లో అందరు తలా ఓ చెయ్యి వేసి సినిమా హిట్ కి దోహదపడ్డారు.. ఇక దిల్ రాజు నిర్మాణ విలువలు అద్భుతం..

ప్లస్ పాయింట్స్ :

వినోదం
వెంకీ నటన
కథ

మైనస్ పాయింట్స్ :

ద్వితీయార్థం లో సాగతీత
అక్కడ క్కడ బోరింగ్ సన్నివేశాలు

చివరగా : మొత్తంగా దిల్ రాజు నిర్మించిన మరో ఫ్యామిలీ ఎంటటైనర్ సినిమా గా చెప్పొచ్చు.. సినిమా లో ముఖ్యంగా వెంకీ నటన హైలైట్.. అనిల్ రావిపూడి బలం కామెడీ కనుక సినిమా మొత్తం కామెడీ ని నింపడానికి ప్రయత్నించి చాల వరకు సక్సెస్ అయ్యాడు. ఈ సంక్రాంతి ఫ్యామిలీ తో కలిసి హాయిగా నవ్వుకోవాలంటే ఈ సినిమా కి వెళితే ఆ కోరిక తప్పక తీసుతుంది..

రేటింగ్ : 3.5/5

Leave A Reply

Your email address will not be published.