పవన్ సపోర్ట్ లేకుండా అలీ రాజకీయంగా ఎదిగేనా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , కమెడియన్ అలీ మధ్య సాన్నిహిత్యం గురించి అందరికి తెలిసిందే.. పవన్ తొలి సినిమా నుంచి అలీ కి తన సినిమా లో ఇంపార్టెంట్ రోల్ ఇస్తూ వచ్చాడు.. అసలు అలీ లేనిదే పవన్ సినిమా చేసేవాడు కాదన్నంత రేంజ్ లో వారి మధ్య బంధం ఉండేది.. అయితే తాజాగా అలీ చేసిన ఓ పని పవన్ తో పాటు పవన్ అభిమానులకు కూడా కోపం తెప్పించేలా ఉందట..

అలీ రాజకీయంగా దిగడమే అందుకు కారణం.. దిగితే దిగాడు కానీ పవన్ జనసేన ను కాదని వైసిపి లో చేరడం పవన్ అభిమానులకు రుచించట్లేదు.. అందుకే అలీ పై మెగా ఫాన్స్ గుర్రుగా ఉన్నాడు.. అంత మంచి బంధం ఉన్న పవన్ , అలీ ల మధ్య ఎందుకంత దూరం పెరిగింది.. అలీ జనసేన లోకి వస్తానంటే పవన్ వద్దన్నాడా, లేదా ఎవరిని అడక్కుండా ఆలీనే డైరెక్ట్ గా వైసిపి లోకి జాయిన్ అయ్యాడా.. సినిమా అవకాశాలు తగ్గుతున్న ఈ క్రమంలో అలీ పవన్ ని కాదని రాజకీయంగా ఎంతవరకు ఎదుగుతాడో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.