వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ కి ఆదిలోనే ఆటంకం..!!

వైవిధ్యభరితమైన సినిమా లతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ తాజాగా ‘వాల్మీకి’ అనే మరో వినూత్నమైన సినిమాని ఒప్పుకున్న సంగతి తెలిసిందే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఇటీవలే పూర్తికాగా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది.. తమిళ సూపర్ హిట్ సినిమా ‘ జిగర్తాండ’ కు ఇది తెలుగు రీమేక్ సినిమా కాగా అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కాగా ఈ సినిమా టైటిల్ లోనే ఆదిలోనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వాల్మీకి సంఘం నాయకులూ.. ఈ టైటిల్ తో భక్తి రస చిత్రాలనే నిర్మించాలి కానీ ఇలాంటి ప్రేమ , వినోదభరితమైన సినిమాలు తెరకెక్కించొద్దంటూ, వెంటనే సినిమా నిలిపివేయకపోతే ఊరుకోమంటూ తెలిపారు.. తక్షణమే పేరు ను మార్చి సినిమా తీయాలని లేదంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.