అదరగొట్టిన కివీస్.. చివర్లో తడబాటు..టీం ఇండియా లక్ష్యం 244 ..!!

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డే లో టీం ఇండియా ముందు 244 పరుగుల లక్ష్యం ఉంచింది కివీస్.. రాస్ టేలర్ (93) అద్భుతం ఇన్నింగ్స్ తో లేతమ్(51) సపోర్ట్ తో న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లకు గాను 243 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కి ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. టేలర్, లేతమ్ ఇద్దరు అద్భుతంగా ఆది స్కోర్ ను 200 దాటించే ప్రయత్నం చేశారు.. వీరి తర్వాత ఏ బ్యాట్స్ మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.. భారత బౌలర్స్ లో షమీ 3 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్, చాహల్, హార్దిక్ పాండ్య లు తలా 2 వికెట్లు సాధించాడు.. ఈ మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్య పట్టుకున్న కేన్ విల్లియమ్స్ క్యాచ్ ఈ మ్యాచ్ కె హైలైట్ అని చెప్పొచ్చు.. అనంతరం బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా మంచి ఆరంభాన్ని చేస్తుంది.. రోహిత్, ధావన్ ద్వయం మంచి ఫామ్ లో ఉన్నారు..

Leave A Reply

Your email address will not be published.